News

గోవును రాష్ట్ర రాజ్యమాతగా ప్రకటించాలి : అజయ్ వర్మ ఠాగూర్

313views

గోవును రాష్ట్ర రాజ్య మాతగా ప్రకటిస్తూ ప్రభుత్వం తీర్మానం చేయాలని గో సేవ సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ వర్మ ఠాగూర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే దేశంలోని 2 రాష్ట్రాలు గోవును రాజ్యమాతగా ప్రకటించాయని, వాటి బాటలోనే ఆంధ్రప్రదేశ్ పయనించాల న్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గోశాలలకు భూమిని కేటాయించాలని ప్రభుత్వానికి వినతిపత్ర మిస్తామన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గోశాలలు నిర్మిస్తామన్నారు. గో సేవ సంరక్షణ సంస్థను బలోపేతం చేసేందుకు 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సభ్యులను నియమించామని, త్వరలో గ్రామస్థాయి వరకు సభ్యులను నియమిస్తామని చెప్పారు.