News

పహల్గామ్ ఊచకోతపై ప్రతీకారం తీర్చుకోవాలని విహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌పి డిమాండ్, ఏప్రిల్ 25న దేశ వ్యాప్త నిరసన

314views

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని విశ్వ హిందూ పరిషత్ -విహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌పి తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో హిందూ యాత్రికులను లక్ష్యంగా చేసుకొని ఈ ఊచకోత
సమర్ధనీయం కాదని “పాకిస్తాన్ చేసిన జిహాదీ యుద్ధ ప్రకటన”గా అభివర్ణించిన విహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌పి భారత ప్రభుత్వం నుండి నిర్ణయాత్మకమైన తక్షణ ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చింది.

విహెచ్‌పి కేంద్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ విలేకరులతో మాట్లాడుతూ, “ఈ అనాగరిక సంఘటన కేవలం ఉగ్రవాద దాడి కాదు – ఇది పాకిస్తాన్ మద్దతు ఉన్న ఇస్లామిక్ జిహాదీ శక్తులు చేసిన బహిరంగ యుద్ధం. 1990లలో కాశ్మీర్ లోయను పట్టుకున్న ఉగ్రవాదాన్ని ఇది గుర్తు చేస్తుందని అన్నారు. కాశ్మీర్‌లో మరోసారి తల ఎత్తడానికి ధైర్యం చేసే మత ఉగ్రవాదాన్ని మనం నిర్మూలించాలి” అని ఆయన అన్నారు.

పహల్గామ్‌లో జరిగిన దాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది, ప్రత్యక్ష సాక్షుల నివేదికల ప్రకారం, నేరస్థులు ప్రయాణికుల ప్యాంటు తొలగించి, కల్మా పారాయణం చేయాలని డిమాండ్ చేసి, ముస్లిమేతరులని నిర్ధారించిన తర్వాత కూడా వారి ఐడిలను తనిఖీ చేశారని పేర్కొన్నారు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం ఒక మతం వారినే లక్ష్యంగా చేసుకోవడం చూస్తే ఈ దాడి మతపరంగా ప్రేరేపించబడిందని నిస్సందేహంగా రుజువు చేస్తుందని డాక్టర్ జైన్ అన్నారు.

“ఇది పాకిస్తాన్ మద్దతుగల జిహాదీలు మరియు వారి స్థానిక స్లీపర్ సెల్స్ చేసిన ముందస్తు ప్రణాళికతో లక్ష్యంగా చేసుకున్న హత్య కాండ అని పేర్కొన్నారు. వారి ఎజెండా స్పష్టంగా ఉంది – హిందువులను లోయ నుండి తరిమికొట్టడం, 1990ల నాటి భయానక పరిస్థితులను తిరిగి సృష్టించడం” అని ఆయన అన్నారు.

ఈ ఊచకోతపై భారత ముస్లిం నాయకుల మౌనాన్ని డాక్టర్ సురేంద్ర జైన్ ప్రశ్నించారు. “వారు వక్ఫ్ ఆస్తి భయాలతో జాతీయ అశాంతిని సృష్టిస్తున్నారు, కానీ అమాయక హిందూ యాత్రికుల హత్యను ఖండించడానికి వారు ముందుకు రాలేకపోతున్నారు? ఈ వ్యూహాత్మక మౌనం ఆమోదయోగ్యం కాదు” అని తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలని, కాశ్మీర్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు దృఢమైన ప్రతిస్పందన ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, విహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌పి మరియు బజరంగ్ దళ్ ఏప్రిల్ 25న దేశవ్యాప్త నిరసనను ప్రకటించాయి. “మన గడ్డపై మతపరమైన ప్రక్షాళనను మనం ఇక ఎప్పటికీ సహించబోమని ప్రపంచానికి భారత్ చూపించాల్సిన క్షణం ఇది” అని డాక్టర్ జైన్ వివరించారు.