News

అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

674views

కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి వారిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న కేంద్రమంత్రికి ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆయన చే విశేష పూజలను చేయించారు. అనంతరం స్వామి వారి చిత్రపటాలను అందజేసి శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ…. శ్రీలక్ష్మి నరసింహ స్వామి తమ ఇంటి ఇలవేల్పు అని అహోబిలంలో స్వామివారిని దర్శించుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అహోబిల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని అన్నారు.