
జమ్ము-కశ్మీర్ హిమాలయాల్లోని అమర్‌నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ యాత్రకు రిజిస్ట్రేషన్‌లు సోమవారం నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో ప్రారంభమైనట్టు అధికారులు తెలిపారు. ఈ యాత్ర ఈ ఏడాది జూలై 3న ప్రారంభమై రక్షాబంధన్ దినమైన ఆగస్టు 9న ముగుస్తుంది. అమర్‌నాథ్ వెళ్లాలనుకునే భక్తులకు రెండు మార్గాలుంటాయి.
వేసవికాలంలో అమర్‌నాథ్ యాత్ర జరుగుతుంది. ఈ తీర్థయాత్రను మతపరంగా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు భక్తులు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు ప్రారంభించి.. యాత్రకు వెసులుబాటు కల్పిస్తుంది. లక్షల్లో భక్తులు పాల్గొంటారు. దీనిలో భాగంగానే 2025కు గానూ.. ఏప్రిల్ 14వ తేదీ నుంచి అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దానికి సంబంధించిన పూర్తి ప్రక్రియను, ఎలా దరఖాస్తు చేయాలో చూసేద్దాం.
జూన్ 29 నుంచి ఆగస్టు 19వ తేదీవరకు కొనసాగనుంది
అమర్‌నాథ్ యాత్రకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైపోయాయి. అమర్‌నాథ్ యాత్ర 2025లో జూన్ 29 నుంచి ఆగస్టు 19వ తేదీవరకు కొనసాగనుంది. మీరు ఇక్కడికి వెళ్లాలనుకుంటే.. అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ www.jksasb.nic.in ని సందర్శించాలి. సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది.
మీరు మీ వైద్యుల నుంచి ఈ సర్టిఫికెట్ తెస్తే కుదరదు
మెడికల్ రిపోర్ట్ లేకుండా మీరు అమర్‌నాథ్ యాత్ర చేసేందుకు అనుమతి లభించదు. అలా అని మీరు మీ వైద్యుల నుంచి ఈ సర్టిఫికెట్ తెస్తే కుదరదు. SASB వెబ్‌సైట్‌లో ఏ ఆస్పత్రిలో ఏ వైద్యుల దగ్గర నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలో లిస్ట్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఫిట్‌గా ఉంటే వెంటనే అమర్‌నాథ్ యాత్రకోసం రిజిస్టర్ చేయించుకోండి. శివుని దర్శనం చేసేసుకోండి.





