News

19 నుంచి అష్ట ప్రహరీ రామనామ యజ్ఞ సంకీర్తన నామ జపయజ్ఞం

296views

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పురపాలక సంఘ పరిధి బెల్లుపడ మరోసారి ఆధ్యాత్మిక శోభతో అలరించనుంది. ఈ నెల 19 నుంచి ఘృత, నామ యజ్ఞాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం బాహుదా నదిలో గంగ పూజ చేసి కలశాలతో జలాలను తీసుకొచ్చి ఇళ్ల వద్ద పూర్ణకుంభాలు ఏర్పాటు చేస్తారు. చినజీయర్‌ స్వామి, ఆయన శిష్యుల ఆధ్వర్యంలో పాంచాహ్నిక పంచకుండాత్మక శ్రీరామతారకనామ మహామంత్ర ఘృతయజ్ఞం, భక్తి ప్రచారక్‌ జ్యోతి మహారాజ్‌ ఆధ్వర్యంలో అష్ట ప్రహరీ రామనామ యజ్ఞ సంకీర్తన నామ జపయజ్ఞం నిర్వహించనున్నారు. ఆంధ్రా, ఒడిశా ప్రాంతాల నుంచి 19 బృందాల భజగోవింద గోష్ఠి కళాకారులు హరినామసంకీర్తనలు ఆలపించనున్నారు. మందసలోని వాసుదేవస్వామి దేవాలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో క్రతువులు జరుగుతాయి. 23 వరకు రోజూ ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు ఏకధాటిగా నారాయణసేవ (అన్నప్రసాద వితరణ) నిర్వహించడానికి పెద్దఎత్తున పందిళ్లు సిద్ధం చేస్తున్నారు. 24న పూర్ణాహుతి అనంతరం పూర్ణకుంభాలను నదిలో నిమజ్జనం చేస్తారు.