
321views
విశాఖపట్నం హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హనుమాన్ శోభాయాత్ర’లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ కూడలి నుంచి కాళీమాత ఆలయం వరకు ఈ యాత్ర సాగింది. ఆనందపురం, పెందుర్తి, గాజువాక, మురళీనగర్, పాత పోస్టాఫీస్ ఇలా నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి బైక్ ర్యాలీలతో భక్తులు అక్కడికి చేరుకొన్నారు. జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో ముందుకు సాగారు. సీతారామలక్ష్మణ, హనుమాన్ విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా తీసుకెళ్లారు.





