News

తిరుపతి గోశాలను సందర్శించిన టిటిడి ఛైర్మన్

354views

తిరుపతిలోని గోశాలను ఈరోజు సందర్శించారు టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు. గోవులను ఏ విధంగా సంరక్షిస్తున్నారు..ప్రస్తుతం ఎన్ని గోవులు టిటిడిలో ఉన్నాయో గోశాల ఇన్చార్జ్ శ్రీనివాసులు టిటిడి ఛైర్మన్ కు వివరించారు. అనంతరం గోదానం చేశారు టిటిడి ఛైర్మన్. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ గోశాలలో గోవులు మరణించాయంటూ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని..ఇందులో ఏ మాత్రం నిజం లేదు. గోమాతను పూజిస్తూ..గోమాతను సంరక్షిస్తున్నామని టిటిడి ఛైర్మన్ తెలిపారు.