News

ప్రపంచ భాషల్లోకి భగవద్గీత…తెలుగు ఆడియో విడుదల

394views

భగవద్గీత విశిష్టతను ప్రపంచ భాష ల్లోకి తీసుకెళ్లాలని సంకల్పించినట్లు డాక్టర్ గజల్ శ్రీనివాస్ చెప్పారు. ఇప్పటికే 25 భాషల్లో ఈ ప్రక్రియ పూర్తయిందని, సంపూర్ణమయ్యాక ప్రజలకు అందించాలని ఆకాంక్షి స్తున్నట్లు తెలిపారు. ఆయన స్వరకల్పనలో తెలుగులో రూపొందించిన సంపూర్ణ శ్రీమద్ భగవద్గీత ఆడియో సీడీ ఆవి ష్కరణ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లయన్స్ సామాజిక భవనంలో జరిగింది. శ్రీనివాస్ తండ్రి కేశిరాజు నరసింహరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నాటక అకాడమి ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ భగవద్గీతను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లాలన్న సంకల్పం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు.