News

”విధ్వంసం చేయాలి… ఎనిమిది నుంచి పది మంది చావాలి”… కాంగ్రెస్ నేత వీడియో వైరల్

584views

వక్ఫ్ సవరణ చట్టంపై కొందరు ముస్లింలను రెచ్చగొడుతూనే వున్నారు. ఇదే విషయాన్ని విశ్వహిందూ పరిషత్ తాజాగా పేర్కొంది కూడా. తాజాగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. కర్నాకటలోని దావణగెరేకి చెందిన కాంగ్రెస్ నేత కబీర్ ఖాన్ వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించే వీడియో వెలుగులోక వచ్చింది.

వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ యువత వీధుల్లోకి రావాలని, ప్రజా ఆస్తులను నాశనం చేయాలని కాంగ్రెస్ నేత కబీర్ ఖాన్ పిలుపునిచ్చారు. అంతేకాకుండా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తమ ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధంగా వుండాలన్నది ఆ వీడియోలో వుంది. ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే.. ఈ వీడియో బయటికి వచ్చినప్పటి నుంచి కబీర్ ఫోన్ స్విచ్ఛాఫ్ లో వుంది. ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఈ వీడియోలో కాంగ్రెస్ నేత కబీర్ ఖాన్ ఏమన్నారంటే ’’బస్సులు, రైళ్లకు నిప్పు పెట్టండి. కొంత మంది ప్రాణాలివ్వండి. ప్రతి పట్టణంలో ఎనిమిది నుంచి పది మంది మరణాలు సంభవించాలి. పోస్టర్లు, పిటిషన్లు పనికిరావు. విధ్వంసం మాత్రమే జరుగుతుంది’’ అని అందులో వుంది.

దీంతో పోలీసులు కాంగ్రెస్ నేత కబీర్ ఖాన్ పై కేసులు నమోదు చేశారు. హింసను ప్రేరేపించారని, మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారన్న అభియోగాలు కూడా నమోదయ్యాయి. అలాగే కబీర్ ఖాన్ మాటలు సమాజంలో శాంతికి భంగం కలిగించేలా వున్నాయన, హింస, ద్వేషాన్ని ప్రేరేపించే విధంగా వున్నాయని, వీటితో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు అన్నారు.