News

ఆధునికకాల సవాళ్లకు భారతీయ వేదాల్లో పరిష్కారం

320views

యుద్ధాలు, సంఘర్షణలు, మానవ విలువల క్షీణత వంటి ఆధునికకాల ప్రపంచ సవాళ్లకు భారతీయ వేదాల్లో చూపిన అద్వైత సిద్ధాంతం పరిష్కారాలు చూపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌ జిల్లా ఆనంద్‌పుర్‌ ధామ్‌ను ప్రధాని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవులందరూ ఒకటే అనే ఆలోచన ప్రపంచానికి వెలుగునిస్తుందని, సంఘర్షణలను అంతం చేయగలదని తెలిపారు. రుషులు, పండితులు, సాధువులతో కూడిన భారతదేశం విపత్కర పరిస్థితులు ఎదురైనపుడల్లా సమాజానికి మార్గం చూపిందన్నారు. పూజ్య స్వామి అద్వైత్‌ ఆనంద్‌జీ మహరాజ్‌ జీవితం ఈ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఆనంద్‌పుర్‌ ధామ్‌ పర్యావరణ పరిరక్షణలోనూ గొప్ప పాత్ర పోషిస్తోందని ప్రధాని ప్రశంసించారు.