
513views
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లో గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనగర్‌లోని మౌలానా ఆజాద్ రోడ్డు ప్రాంతంలోని ఓ మార్కెట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఇప్పటికే భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వారం రోజుల క్రితం సొపోర్‌లోని ఓ బస్‌స్టాండ్‌లో ఉగ్రవాదుల జరిపిన గ్రనేడ్ దాడిలో 15 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VAT ఆంధ్రప్రదేశ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





