News

ఢిల్లీ ఐఐటీలో స్పేస్ టెక్నాలజీ సెల్

75views

ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) లో ‘స్పేస్ టెక్నాలజీ సెల్’ ఏర్పాటవుతోంది. ఇందుకు సంబంధించి ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వి. రాంగోపాల్‌రావు, ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ కే. శివన్ మధ్య అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. అవగాహనా ఒప్పందంపై వీరిరువురూ సంతకాలు చేశారు. సంతకాల తర్వాత ఒప్పందం పత్రాలను పరస్పరం మార్పిడి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాంగోపాల్‌రావు మాట్లాడుతూ, స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలపై ఈ సెల్ పనిచేస్తుందన్నారు. ఈ ఒప్పందంతో ఇస్రో చేపట్టే వివిధ పరిశోధనల్లో ఐఐటీ ఢిల్లీ భాగస్వామ్యం అవుతుందన్నారు. ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో-టెక్నాలజీ, ఫంక్షనల్ టెక్స్‌టైల్స్, స్మార్ట్ మ్యానుఫాక్చరింగ్‌లతో పాటు రెండు సంస్థలు సంయుక్తంగా చేపట్టే ఇతర అంశాల్లో కూడా ఐఐటీ ఢిల్లీ పాలుపంచుకుంటుందని వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VAT ఆంధ్రప్రదేశ్ యాప్ ను డౌన్    లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.