News

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటీల సమావేశం

35views

హైదరాబాద్: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శనివారం (జూలై 19, 2026) హైదరాబాద్‌లోని మెహదీపట్నం పుల్లారెడ్డి స్కూల్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పట్టణాల్లో గణేష్ ఉత్సవాలను నిర్వహించే కమిటీల ప్రతినిధుల రాష్ట్రస్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో పాటు సామాజిక సామరస్య వాతావరణంలో నిర్వహించడం, వివిధ కమిటీల మధ్య సమన్వయం, కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు.

తెలంగాణలోని వివిధ జిల్లాలు, పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో గణేష్ ఉత్సవ కమిటీల ప్రతినిధులు హాజరై తమ ప్రాంతాల్లో చేపట్టనున్న ఉత్సవాల ఏర్పాట్లు, అనుభవాలను పరస్పరం పంచుకున్నారు. ఈ సమావేశం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలు, కార్యాచరణపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది.