
గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిని గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం, ఏటీఎస్ అరెస్టు చేసింది.
సిధ్‌పూర్ తాలూకాలోని ఖడియాల్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో బిలాల్ అబిద్‌భాయ్ షేరా, మొహమ్మద్ అయూబ్ కడివాలా, మొహమ్మద్ పాలన్‌పురి అలియాస్ ఖాలీ అయూబ్ సున్సారా, షఫియా రైస్ ముఫ్తీ, మొహమ్మద్ హసన్ కర్డియాలను అదుపులోకి తీసుకున్నారు.
ఈ నెల 3వ తేదీన అరెస్టైన మరో ఎనిమిది మంది అనుమానితుల విచారణలో లభించిన సమాచారం ఆధారంగా ఈ అరెస్టులు జరిగినట్లు ఏటీఎస్ తెలిపింది.
నిందితుల్లో ఒకరు టైమ్ బాంబు తయారు చేయడానికి ప్రయత్నించినట్లు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది పి.ఆర్. దంతాని తెలిపారు. నిందితుల వద్ద నుంచి బాంబు తయారీకి సంబంధించిన సామగ్రితో పాటు ఉర్దూ భాషలో ఉన్న జైష్-ఎ-మొహమ్మద్‌కు సంబంధించిన సాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల తయారీ సామగ్రి, జిహాదీ సాహిత్యం ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో ఏటీఎస్ దర్యాప్తు కొనసాగిస్తోంది.





