News

అయోధ్య తీర్పుపై మాట జారారో…. – పోలీసుల హెచ్చరిక.

193views

తి త్వరలో రామ జన్మ భూమికి సంబంధించిన తీర్పు వెల్లడి కానుంది. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు అయోధ్యలో దీపావళి జరుగుతుందని హిందూ బంధువులు భావిస్తున్నారు. తీర్పు వచ్చిన వెంటనే పలువురు సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పలు సూచనలు చేశారు. ఎలా పడితే అలా పోస్టులు పెడితే తప్పకుండా శిక్ష పడుతుందని చెబుతున్నారు.  సోషల్ మీడియా వినియోగదారులకు ఉత్తరప్రదేశ్ పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీచేశారు. అయోధ్య అంశంపై ఇతరుల మనోభావాలు గాయపడేలా అభ్యంతరకరమైన, వివాదాస్పదమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలను దెబ్బతీసే వారిని ఉపేక్షించబోమని, జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని యూపీ డీజీ ఓపీ సింగ్ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.