News

గోటి తలంబ్రాలకు కోటి దీపోత్సవం

401views

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కల్యాణం అప్పారావు ఆధ్వర్యంలో భద్రాచలం గోదావరి స్నాన ఘట్టాల వద్ద గోటి తలంబ్రాలకు కోటి దీపోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. పవిత్ర నదీ జలాన్ని శిరసుపై చల్లుకుని రామ నామాలు పఠిస్తూ కలశాలలో ఉన్న తలంబ్రాలకు పూజలు చేశారు. కోటి ఒత్తులను వెలిగించి తలంబ్రాలకు హారతి ఇచ్చారు. ఈ గోటి తలంబ్రాలను శోభాయాత్రగా రామాలయానికి తీసుకొచ్చి అధికారులకు అందించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. తీరంలో కార్తిక దీపాలు వెలిగించారు. విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీపూజ నిర్వహించారు.