News

విశాఖలో ‘టైగర్ ట్రంప్-25’ విన్యాసాలు

423views

భారత్-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘టైగర్ ట్రంప్-25’సముద్ర విన్యాసాలు మంగళవారం విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భారత్ లో అమెరికా రాయబారి జోర్గాన్ కె. ఆండ్రూస్ మాట్లాడుతూ.. కార్యక్రమానికి విశాఖపట్నం వేదికవడం సంతోషకరమన్నారు. రాబోయే 2 వారాలపాటు జరిగే విన్యాసాలు ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రతకు దిక్సూచిగా నిలుస్తాయన్నారు. ‘ఐఎన్ఎస్ జలశ్వ’ నౌకపై విన్యాసాలు ప్రారంభం కాగా.. ముగింపు వేడుకలు ఈనెల 13న కాకినాడ తీరాన అమెరికా నౌక ‘యూఎస్ఎస్-కాంస్టాక్ పై జరగనున్నాయి. ఏప్రిల్ ఒకటి నుంచి 7 వరకు ‘హార్బర్ ఫేజ్’, ఏప్రిల్ 8 నుంచి నుంచి 13 వరకు ‘సీ ఫేజ్’ విన్యాసాలు నిర్వహించనున్నారు. ప్రారంభ కార్యక్రమంలో ఈస్ట్రన్ నేవల్ కమాండ్ చీఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా, యూఎస్ నౌక కాంస్టాక్ కమాండర్ బైరాన్ స్టాక్స్ తో పాటు ఇరు దేశాల రక్షణ అధికారులు రియర్ అడ్మిరల్ డి.గ్రిగారీ న్యూకిర్క్, కెప్టెన్ నౌషద్ అలీఖాన్, రియర్ అడ్మిరల్ సుశీల్మీనన్లు పాల్గొన్నారు.