News

వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన ముస్లిం మహిళలు

357views

దేశ వ్యాప్తంగా వక్స్ సవరణ బిల్ల చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు కొందరు మద్దతిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. వక్స్ సవరణ బిల్లకు జెడియు, టిడిపి, జెడిఎస్ వంటి పార్టీల మద్దతు ఇచ్చాయి. ప్రతిపక్ష కూటమి బిల్లుకు వ్యతిరేకించింది. ఇలాంటి తరుణంలో తీవ్ర నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం వక్స్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది.

ప్రతిపక్షాల నిరసన మధ్య ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి భిన్నమైన మద్దతు లభించింది. ఇక్కడ ముస్లిం మహిళలు వక్స్ సవరణ బిల్లుకు మద్దతుగా ముందుకు వచ్చారు. భోపాల్లో పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు ప్రధాని మోడీకి మద్దతుగా ప్లకార్డులు పట్టుకుని నినదించారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘మోడీజీ మీరు పోరాడండి… మేము మీతోనే ఉన్నాము’ అని మహిళలు నినాదాలు చేశారు. ఢిల్లీలో కూడా ముస్లిం మహిళలు వ బిల్లుకు మద్దతుగా ముందుకు వచ్చారు. మహిళలు ప్లకార్డులు పట్టుకుని.. వాటిలో ‘వక్స్ ఆస్తి ఆదాయాన్ని దాని నిజమైన యజమానికి అందించినందుకు, వక్స్ బోర్డులో మహిళలు, వెనుకబడిన ముస్లింలకు వాటా ఇచ్చినందుకు మోడీ జీ ధన్యవాదాలు’ తెలిపారు.