News

జ్యోతి క్షేత్రంలో ఆశ్రమాలు తిరిగి నిర్మించాలి

373views

కాశి నాయన జ్యోతి క్షేత్రంలో ఇటీవల కూల్చివేసిన ఆశ్రమాలను తిరిగి నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ అన్నమయ్య కళాక్షేత్రం, హిందూస్‌ ఫర్‌ ఫ్లూరలిటీ అండ్‌ ఈక్వాలిటీ సంయుక్తాధ్వర్యంలో కడప కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్‌స్వామి, హెచ్‌పీఈ జాతీయప్రధాన కార్యదర్శి కొవ్వూరు లోకనాథ్‌ మాట్లాడుతూ కాశిరెడ్డి నాయన జ్యోతి క్షేత్రం ఎంతో ప్రసిద్ధిగాంచిందన్నారు. ఆశ్రమ వసతి గృహాలను అటవీ అధికారులు కూల్చివేసిన సంఘటన లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కూల్చివేతలు ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జై భారత జాతీయ ఉపాధ్యక్షుడు వంశీ, గురవయ్య, పలువురు భజన కళాకారులు పాల్గొన్నారు. అనంతరం జేసీకి వినతిపత్రం అందజేశారు.