News

టోక్యోలో శివాజీ మహరాజ్ విగ్రహం

413views

భారత్, జపాన్ మధ్య ఘనమైన సాంస్కృతిక, ఛత్రపతి మహరాజ్ విగ్రహాన్ని టోక్యోలో ప్రతిష్ఠించడంతో చారిత్రక సంబంధాలకు తార్కాణం అన్నట్టుగా టోక్యోలో అతి పెద్ద ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం ఆవిష్కృతమైంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు స్వామి గోవింద్ దేవ్ గిరిజీ మహరాజ్ ఆధ్వర్యంలో మార్చి 8న జరిగిన ఓ వేడుకలో ఈ చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది.

అంతర్జాతీయంగా శివాజీ మహరాజ్ మన వారసత్వాన్ని విస్తరింపజేయడం, శివభక్తులను ఏకం చేయడం లక్ష్యంగా భారత్-జపాన్ శివస్వరాజ్ రథయాత్రలో భాగంగా ఉక్కు ఫైబర్తో తయారై 8.5 అడుగుల ఎత్తు, 450 కేజీల బరువున్న ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని జపాను తెప్పించారు. శివాజీ మహరాజ్ విగ్రహం టోక్యో చేరుకోవడానికి ముందు భారత్లోని అహ్మదాబాద్ పాటుగా అనేక నగరాల్లో పూజలందుకున్నది. ఎల్లరెరుగని నాయకత్వానికి, దూరదృష్టికి నిలువెత్తు నిదర్శనమైన ఇండో – జపాన్ సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది.

పూనె నగరానికి చెందిన సామాజిక కార్యకర్త ఉత్తమ్ రామ్ మందరె ఈ కార్యక్రమంలో ఓ కీలకమైన పాత్ర పోషించారు. ఉత్తమ్ రామ్ మాట్లాడుతూ “జమ్మూ కాశ్మీర్లోని కుప్వారాలో ఉన్న విగ్రహం స్ఫూర్తిగా ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. మా లక్ష్యం శివాజీ మహరాజ్ బోధనలను అంతర్జాతీయ వేదిక మీదకు తీసుకురావడం. ప్రస్తుతం టోక్యో ఆయన ఘనమైన వైభవాన్ని ప్రపంచం ఎదుట ప్రదర్శిస్తోంది” అని అన్నారు. మొదట్లో అహ్మదాబాద్లో విగ్రహానికి స్వాగతం పలికిన ఎల్లిస్ బ్రిడ్జ్ ఎమ్మెల్యే అమిత్ షా మాట్లాడుతూ శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణ హిందువులందరికీ ఓ గర్వకారణమైన క్షణంగా నిలిచిపోతుందని అన్నారు. “టోక్యోలో శివాజీ మహరాజ్ విగ్రహం జపాన్తో మన సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేస్తుంది. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే ఓ చుక్కానిగా నిలిచిపోతుంది” అని తెలిపారు.