News

బోథ్‌లో లవ్ జిహాద్ కేసు… హిందూ సంఘాల జోక్యంతో క్షేమంగా హిందూ యువతి

308views

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో లవ్ జిహాద్ కేసు బయటపడింది. ఓ హిందూ అమ్మాయిని, ముస్లిం అబ్బాయి తీసుకెళ్లాడు. దీంతో బీజేపీ నేతలు, హిందువులు నిరసనకు దిగారు. అయితే తన కూతురు తప్పిపోయిందని హిందూ కుటుంబం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వెతకడం ప్రారంభించారు.

అయితే.. హిందూ అమ్మాయిని గత నెల 26 న ఓ ముస్లిం అబ్బాయి తీసుకొని వెళ్లిపోయాడు. ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి, హిందూ అమ్మాయి పేరు కూడా మార్చేశాడు. అంతేకాకుండా అమ్మాయి తల్లి పేరును కూడా ముస్లిం పేరుగా మార్చేశాడు. దీనికి తగ్గ ఆధార్ కూడా ముస్లిం అబ్బాయి సృష్టించాడు. అంతేకాకుండా వారిద్దరికీ పెళ్లి జరిగిపోయిందని, అమ్మాయి మతం మారిపోయిదంటూ తప్పుడు ప్రచారానికి దిగాడు. అయితే… ఈ సర్టిఫికేట్‌ను ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు నుంచి తెచ్చుకున్నాడు. వయస్సు తక్కువగా వున్నా… ఎక్కువ యస్సు వున్నట్లు సర్టిఫికేట్‌లో చూపించాడు.

ఈ విషయం తెలియడంతో ఆదిలాబాద్ బీజేపీ అధ్యక్షుడు బ్రహ్మానంద్, హిందూ వాహిని నేతలు రంగంలోకి దిగారు. వారితో మాట్లాడేసరికి, హిందూఅమ్మాయి వేష భాషలన్నీ మారిపోయి తమకు కనిపించిందని అంటున్నారు. అయితే.. తిరిగి ఈ అమ్మాయి వచ్చేసింది. ఈ అమ్మాయిని వెంటనే సఖి సెంటర్‌కి పంపాలని బీజేపీ నేతలు, హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కానీ.. పోలీసులు సఖి పంపలేదు. దీంతో నిరసనను మరింత పెంచారు. చివరికి బీజేపీ అధ్యక్షుడు, హిందూ వాహిని నేతల జోక్యంతో హిందూ అమ్మాయి క్షేమంగా ఇంటికి చేరుకుంది.

అచ్చు ఇలాంటి ఘటనే వడూర్ అనే గ్రామంలోనూ జరిగిందని బీజేపీ నేతలు అంటున్నారు. కానీ… అతి తొందరగానే హిందూ అమ్మాయి తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుందని ప్రకటించారు. హిందూ అమ్మాయిలను బలవంతంగా తీసుకెళ్లి, మతం మార్చి, పెళ్లిళ్లు చేసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.