
“టైమ్స్ ఆఫ్ ఇండియా” పేపర్.. మరోసారి తన అసలు నైజాన్ని ప్రదర్శించింది. వాస్తవాలకు విరుద్ధంగా, పక్కదారి పట్టించే కథనాలను ప్రచురించడంలో దిట్టైన ఈ మీడియా సంస్థ.. గతంలోనే ఉజ్జయినిలో జరిగిన ఓ ఘటనను.. హిందువుల విశ్వాసాలపై రుద్ది “టాయ్‌లెట్ పేపర్ ఆఫ్ ఇండియా” గా అప్పట్లో దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు మూటకట్టుకుంది. అయినా తీరు మార్చుకోని ఈ పేపర్.. తాజాగా మళ్లీ తన వక్రబుద్ధిని చాటుకుంది. రాజస్థాన్‌లోని అజ్మీర్ దగ్గర జరిగిన లవ్ జిహాద్ కేసును.. లైంగిక దాడి అంటూ చిన్నగా చూపిస్తూ కథనాలు ప్రచురించింది. పాత్రికేయ విలువలకు పాతరేసింది.
రాజస్థాన్‌లోని బీవార్ జిల్లా బిజైనగర్‌లో ఆరుగురు పాఠశాల విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేసి లైంగిక దాడి చేసిన ఘటన.. యావత్ దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. నిందితులంతా ముస్లీంలు కావడంతో.. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే వివరాలు ఆరా తీస్తే.. అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ ఘటన వెనుక భయంకరమైన లవ్ జిహాద్ యాంగిల్ ఉందని తేలింది. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు ఒక మైనర్ తో పాటు 9 మందిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో కరీం ఖురేషి, ఆషిక్ మన్సూరీ, రిహాన్ మొహమ్మద్, సోహైల్ మన్సూరి, సోహెబ్, అర్మాన్ పఠాన్, సాహిల్ ఖురేషిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.
ఈ కేసు విచారణకు ఓ మహిళా సీఐను ప్రత్యేకంగా నియమించారు. ఒక వర్గానికి చెందిన వారంతా ఒక ముఠాగా ఏర్పడి.. లవ్ జిహాద్ పేరుతో ఆరుగురు విద్యార్థినుల జీవితాలతో ఆడుకున్నారని.. పోలీసు అధికారులు నిర్ధారించారు. మొదట ప్రేమ పేరుతో దగ్గరై, తర్వాత మొబైల్ ఫోన్ల వంటి గిఫ్ట్ లు ఇచ్చి.. ఆ తరువాత వారిని శారీరకంగా కలవాలని బలవంతం చేశారని.. వినకపోతే బ్లాక్ మెయిల్ చేసి.. మానసికంగా హింసించినట్లు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు. అంతేకాకుండా.. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనాలని.. లేకపోతే కుటుంబ సభ్యులను చంపేస్తామని.. బెదిరింపులకు దిగారని కూడా వివరించారు.
బాధిత కుటుంబాల ఫిర్యాదుల ఆధారంగా.. నిందితులపై లైంగిక వేధింపులు, బలవంతంగా వ్యభిచారం చేయడం, మతపరమైన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంతో పాటు.. పోక్సో చట్టం వంటి అభియోగాల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే విచారణలో ఇది లవ్ జిహాద్ కోణం ఉందని స్పష్టంగా కనిపిస్తున్నా.. కొన్ని మీడియా సంస్థలు దాన్ని దాచేందుకు తమ సంకుచిత మేథస్సును ఉపయోగించాయి. ప్రతీ దాన్ని హిందూ వ్యతిరేక యాంగిల్‌లో చూసే “టైమ్స్ ఆఫ్ ఇండియా” పేపర్ అయితే.. ఈ ఘటనను కేవలం లైంగిక దాడి అంటూ దాని తీవ్రతను తగ్గించేందుకు తన కలానికి పనిచెప్పింది. బాధిత చిన్నారులు, వారి కుటుంబాలపై కనీస మానవత్వాన్ని కూడా ప్రదర్శించలేకపోయింది.
తప్పుడు కథనాలు, వాస్తవాలు వక్రీకరించి ప్రచురించడంలో దిట్ట అయిన టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ పై గతంలో చాలా ఆరోపణలున్నాయి. ఆ మధ్య ఉజ్జయినిలో ఓ మైనర్ పై రేప్ జరగగా.. రక్తం అంటిన దుస్తులతోనే సహాయం కోసం ఆమె చాలా ఇళ్లముందుకు వెళ్లింది. అయితే కొంత సమయం తర్వాత.. ఓ ఆలయ పూజారీ ఆమెను చేరదీసి, ఆస్పత్రికి పంపించి.. పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. పోలీసులు వచ్చే వరకు ఆమెకు సహాయ సహకారాలు అందజేశారు.
అయితే ఈ ఘటనపై టైమ్స్ ఆఫ్ ఇండియా అత్యంత దుర్మార్గంగా కథనం ప్రచురించింది. ఓ అమ్మాయిపై లైంగిక దాడి జరిగితే.. హిందువులంతా గోమాతకు పూజ చేస్తున్నారంటూ ఓ కార్టూన్ ప్రచురించింది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కాదు.. అది టాయ్ లెట్ పేపర్ ఆఫ్ ఇండియా అనే హ్యష్ ట్యాగ్ వైరల్ అయ్యింది. అంత జరిగినా బుద్ది మార్చుకోని పేపర్.. మరోసారి హిందూ వ్యతిరేకతను ప్రదర్శించింది. అజ్మీర్ ఘటనలో లవ్ జిహాద్ యాంగిల్ కనిపిస్తున్నా.. లైంగిక దాడిగా అభివర్ణించింది. అంటే అంతటి మానసిక క్షోభ అనుభవించిన ఆ విద్యార్థులు, వారి కుటుంబాలపై ఈ పేపర్ కు, దాని యాజమాన్యానికి ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్.. టాయ్ లెట్ కు కూడా పనికిరాదని చెప్పవచ్చు. షేమ్ లెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా..





