News

తుదిశ్వాస వరకు హిందువునే.. అసలు విషయం చెప్పేసిన డిప్యూటీ సీఎం..

410views

‘నేను పుట్టుకతో హిందువును, నా వ్యక్తిగతమైన నమ్మకాన్ని పాటిస్తానని కర్నాటక డిప్యూటీ సీఎం డీసీఎం డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు. సదాశివనగర్‌లోని నివాసం వద్ద ఆయన మీడియాతో ఇషా ఫౌండేషన్‌కు తన కుమార్తె వెళ్లేవారన్నారు. ఈ ఏడాది ఇషా ఫౌండేషన్‌ ముఖ్యులు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ తమ ఇంటికి వచ్చి ఆహ్వానించారన్నారు.ఆయన మైసూరుకు చెందినవారని, ఆయన జ్ఞానం ప్రశంసనీయమన్నారు. తాను హిందువునని అన్ని మతాలను గౌరవిస్తానన్నారు. హిందువుగా పుట్టానని, హిందువుగానే తుదిశ్వాస వీడుతానన్నారు.

మహాకుంభమేళాలో పాల్గొనడం, ఇషా ఫౌండేషన్‌లో శివరాత్రి వేడుకలకు వెళ్లడం వల్ల ప్రచారం సాగుతోందన్నారు. జైన, సిక్కు మఠాలకు వెళ్లానన్నారు. మహాకుంభమేళాలో నా అనుభవం బాగుందని, అక్కడి ఏర్పాట్లను స్వాగతిస్తానన్నారు. ఇదో సాధారణ విషయం కాదని, అంత భారీస్థాయిలో ప్రజలను పర్యవేక్షించడం అనేది సామాన్యమైనది కాదన్నారు. ఒకటిరెండు తప్పులను ప్రస్తావించేది లేదన్నారు.

మతంలో భక్తుడు, భగవంతుడిమధ్య, సంబంధం ఉంటుందని, కొందరు దేవుడితో నేరుగా వ్యవహరిస్తే మరికొందరు అర్చకుల ద్వారా పూజలు జరుపుతారన్నారు.