
మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పుర్‌లో భాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చి సెంటర్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. భారతదేశ మత, సాంస్కృతిక సంప్రదాయాలను వ్యతిరేకిస్తున్నవారిపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు.‘‘ఇటీవల కాలంలో ప్రజల్ని విభజించే నేతల గుంపును చూస్తున్నాం. అనేక సార్లు విదేశీ శక్తులు సైతం ఈ వ్యక్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. హిందూ విశ్వాసాన్ని ద్వేషించే వ్యక్తులు శతాబ్దాలుగా ఏదో ఒక దశలో ఉంటున్నారు. బానిస మనస్తత్వం కలిగిన వ్యక్తులు మన విశ్వాసాలు, నమ్మకాలు, ఆలయాలు, మతం, సంస్కృతి, సూత్రాలపై దాడి కొనసాగిస్తున్నారు. వీరు మన పండుగలు, సంప్రదాయాలు, ఆచారాలను దుర్వినియోగం చేస్తారు. మన సమాజాన్ని విభజించడం, తద్వారా ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే వారి అజెండా.
ఇలాంటి సమయంలో ఎంతో కాలంగా దేశంలో ఐక్యతా మంత్రం గురించి అవగాహన కల్పిస్తోన్న ధీరేంద్ర శాస్త్రి.. ప్రజల ప్రయోజనాల కోసం పదెకరాల్లో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించడం గొప్ప విషయం. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తులతో చాలా ప్రమాదకరమన్నారు. మన దేశ సాంప్రదాయలు, సంస్కృతిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారు బానిస మసనస్తత్వంతో ఉంటూ దేశ ఐక్యతను దెబ్బ తీయడానికి యత్నిస్తున్నాయన్నారు.
ఈ తరహా వ్యాఖ్యలతో దేశ ఐక్యతను దెబ్బ తీయడమే అవుతుంది కానీ దాని వల్ల కలిసొచ్చే ఏమీ లేదన్నారు. అనేక సార్లు విదేశీ శక్తులు సైతం ఈ వ్యక్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.విశ్వాసాలు, నమ్మకాలు, ఆలయాలు, మతం, సంస్కృతితో పాటు మన పండుగలు, సంప్రదాయాలు, ఆచారాలను వీరంతా మంటగలుపుతున్నారు. దాని ఫలితంగా దేశ ఐక్యతను దెబ్బతీయడమే వారు పనిగా పెట్టుకున్నారని మోదీ మండిపడ్డారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళా దేశ ఐక్యతకు చిహ్నంగా భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. కోట్లాది మంది తరలి వస్తున్న మహా కుంభమేళాలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు.





