
కమ్యూనిస్టు పాలిత కేరళలోని అలప్పుజా జిల్లా కాయంకుళంలో వివాదం రేగింది. కేంద్ర ప్రభుత్వం నిధులతో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం ముస్లిం ప్రార్థనలతో ప్రారంభించారు. హిందువులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వివాదం రేగింది. ఈ కార్యక్రమంలో రతీబ్, దువా మజ్లిస్ (ఇస్లామిక్ ప్రార్థనలు) చేశారు. అధికారిక కార్యక్రమంలో ముస్లిం మత ప్రార్థనలను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం చేర్చింది. దీంతో బుజ్జగింపు రాజకీయాలను సీపీఎం ప్రోత్సహిస్తోంది. అలాగే ఇండియన్ ముస్లిం లీగ్ తో సీపీఎం అనుబంధంపై మరో సారి విమర్శలు రేగుతున్నాయి.ఈ కార్యక్రమంలో మంత్రి సాజి చెరియన్, సీపీఎం ఎమ్మెల్యే ప్రతిభా హరి కూడా వున్నారు.
దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. అధికారిక కార్యక్రమంలో ఇస్లామిక్ ప్రార్థనలు ఏంటని మండిపడ్డారు. దీనిని తాము ఖండిస్తున్నామని తెలిపారు. సెక్యులర్ వ్యవస్థకు తీవ్ర విఘాతమన్నారు.బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేరళ ఏమైనా ఇస్లామిక్ రాష్ట్రమా? అంటూ మండిపడ్డారు.





