News

అనంతపురంలో మాతృభాష దినోత్సవ ర్యాలీ

224views

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం మాతృ భాష దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. అనంతరం తెలుగు తల్లి కూడలిలో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు భాషా వికాస సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు జె శ్యామసుందర శాస్త్రి మాట్లాడుతూ, మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. ప్రతి ఒక్కరూ తెలుగు భాష గొప్పతనాన్ని తెలుసుకొని తెలుగు భాషలొనే మాట్లాడాలని, మాతృభాషపై పట్టుంటే అన్య భాషల్లోనూ రాణిస్తారని తెలిపారు. విద్యార్థి దశ నుండి తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలుసుకొని, అదేవిధంగా ప్రతి కార్యాలయాలలోనూ తెలుగు భాషలొనే మాట్లాడాలని అన్నారు.