
దేశభక్తడు, వీరోచిత స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలను నెల్లూరులో భారీ ప్రదర్శనగా నిర్వహించారు. వీఆర్ కళాశాల వైఎంసీ గ్రౌండ్ నుండి భారీ ర్యాలీ మహిళ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. శివాజీ మహరాజ్ గుర్రంపై ఆశీనుడైన వివాజీ విగ్రహం ఊరేగింపుగా సాగింది. భారీ ప్రదర్శనగా దేశభక్తులు కుల మతాలకు అతీతంగా పాల్గొన్నారు. తల్లి జిజియా భాయి ఉగ్గుపాలతోనే దేశక్తిని నూరిపోసిన శివాజీ దేశభక్తికోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయులుగా నివాళు తెలిపారు. రాజనీతి, యద్ద పటిమతో స్వాంత్ర్య పోరాటం సాగించిన శివాజీ దేశభక్తిని స్తూర్తిగా స్మరించకొని భోలో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో పాదచారులు, ప్రయాణ అవసరాలలో ఉన్న వారు పెద్దయెత్తున్న అనుసరించారు.

హిందూ సంస్కృతిని , దేశభక్తి కోసం ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని శివాజీ మహరాజ్ ధీరోత్తమ గాధను తెలిజేసే డీజే సౌండ్స్ తో ర్యాలీ భారీగా సాగింది. శివాజీ సెంటరులో విగ్రహానికి పూలమాలు వేసి జేజేలు తెలిపి ర్యాలీని కొనసాగించారు. ప్రముఖ న్యాయవాది రమాదేవి మాట్లాడుతూ దేశభక్తిని స్పూర్తిగా భావితరాలకు అందించిన శివాజీ మహరాజ్ పూజ్యనీయులన్నారు. ప్రముఖ గైనకాలజిస్టు నిపుణులు మారం విజయ లక్ష్మి మాట్లాడుతూ దేశ భక్తితో కూడిన శివాజీ జీవిత చరిత్రను నేటి తరం స్పూర్తిగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. శివాజీ మహరాజ్ జయంతిని ఏళ్ల తరబడి జరుపుకుంటున్నప్పటికీ , సాయం సమయంలో పండుగగా జరుపుకోనే అనవాయితీ ఆరు సంవత్సరాల నుంచి కొనసాగుతోందని నిర్వహకులు హర్షవర్థన్ తెలిపారు.





