News

ఇన్‌స్టాలో హిందూ బాలికలతో పరిచయం, ఆ తర్వాత చెప్పలేని ఘోరాలు…

577views

32 సంవత్సరాల క్రితం అజ్మీర్ సామూహిక అత్యాచారం, బ్లాక్ మెయిల్ వ్యవహారం సంచలనం రేపింది. అచ్చు ఇలాంటి ఘటనే తాజాగా రాజస్థాన్ లో పునరావృత్తం అయ్యింది. బీవార్ జిల్లా బిజైనగర్ ప్రాంతంలో ఘటన జరిగింది. ముస్లిం ఛాందసులు ఓ మైనర్ ని ట్రాప్ చేసి, లైంగికంగా వేధించారు. అలాగే తమకు కొత్త అమ్మాయిలను పరిచయం చేయాలంటూ బలవంతానికి దిగారు.పాఠశాలకు వెళ్లే హిందూ బాలికలను ముస్లింలు ట్రాప్ చేసి, బ్లాక్ మెయిల్ చేసి, లైంగిక వేధింపులకు దిగారు. బివార్ లో జరిగిన ఈ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి ఇద్దరు మైనర్లతో పాటు ఏడుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ కేసులో రిహాన్ మహ్మద్ (20), సోహైల్ అన్సారీ (19), లుక్మాన్ (20), అర్మాన్ పఠాన్ (19), సాహిల్ ఖురేషి (19) తో పాటు మరో ఇద్దరు మైనర్లున్నారు. మొదట వీరు హిందూ అమ్మాయిలను ఇన్ స్టా వేదికగా పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత వివిధ రకాల బహుమతులు, ఫోన్లతో ఆకర్షించారు. దీంతో వారిని మెళ్లిగా ట్రాప్ లోకి దించారు. విశ్వాసం కుదిరిన తర్వాత వివిధ సాకులు చెప్పి రెస్టారెంట్లు, హోటళ్లకి తీసుకెళ్లారు. ఆ తర్వాత అమ్మాయిలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను రహస్యంగా తీయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఈ వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ కి దిగడం ప్రారంభించారు. లైంగిక వాంఛలు తీర్చాలని, అలాగే మతం కూడా మారాలని ముస్లింలు ఒత్తిడి తేవడం ప్రారంభించారు.

దీంతో హిందూ అమ్మాయిలు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఏం చేయాలో వారికి అర్థమే కాలేదు. చివరికి ఇంటి నుంచి డబ్బులను దొంగలించారు. దీంతో అసలు విషయం కుటుంబీకులకు తెలిసింది. వెంటనే పోలీసుకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులపై పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బలవంతంగా మత మార్పిడి కూడా చేస్తున్నారంటూ కేసులు నమోదయ్యాయి.ఇక నిందితుల నుంచి మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా 15 మందిని అదుపులోకి తీసుకన్నారు.మిగతా వారి కోసం గాలిస్తున్నారు. పాఠశాలకు ఐదుగురు చొప్పున హిందూ అమ్మాయిలను వీరు టార్గెట్ చేశారు.ఈ వ్యవహారం బయటికి రావడంతో హిందూ సంఘాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

1992 అజ్మీర్ ఘటనను గుర్తు చేసిన కేసు..
1992 లో రాజస్థాన్‌లో వెలుగులోకి వచ్చిన ఈ సెక్స్ స్కాండల్‌ కేసు అప్పట్లో దేశం మొత్తాన్ని కుదిపేసింది. అజ్మీర్‌లోని కాలేజీ యువతులే లక్ష్యంగా కొందరు వ్యక్తులు చేసిన అకృత్యాలు బయటికి రావడంతో ఈ సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చింది. 100 మందికిపైగా కాలేజీ అమ్మాయిలను సామూహిక అత్యాచారం చేసి.. వారి నగ్న ఫోటోలను వైరల్ చేశారు. ఈ క్రమంలోనే వారిని బెదిరించి.. మరికొంత మంది అమ్మాయిలను తీసుకువచ్చేలా నిందితులు బ్లాక్ మెయిల్ చేశారు. ఈ క్రమంలోనే ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నఫీస్ చిస్తీ ప్రధాన నిందితుడు అని తేల్చారు.

ఈ నేపథ్యంలోనే ఈ 32 ఏళ్ల సెక్స్ స్కాండల్‌ కేసులో అజ్మీర్ స్పెషల్ కోర్టు ఆరుగురికి జీవిత ఖైదు వేసింది. నఫీస్ చిస్తీ, సలీం చిస్తీ, ఇక్బాల్ భాటి, నసీమ్ సయ్యద్, జమీర్ హుస్సేన్, సోహిల్ ఘనీలను తాజాగా స్పెషల్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ లైంగిక కుంభకోణంలో మొత్తం 18 మంది నిందితులు ఉన్నట్లు తేలింది. వారిలో 9 మందికి ఇప్పటికే శిక్షలు పడగా.. మిగిలిన 9 మంది నిందితుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. మరో వ్యక్తి పరారీలో ఉండగా.. ఇంకో వ్యక్తిపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది. తాజాగా మిగిలిన ఆరుగురు వ్యక్తులకు కోర్టు శిక్ష విధించింది.