
ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని కలిగిస్తుందని భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ఎస్ తేజేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళంలోని శాంతి నగర్ కాలనీ లో గల గాంధీ మందిరంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ 395 వ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. .హిందూ మతాన్ని విశ్వవ్యాప్తం చేయటంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ అగ్ర గణ్యులు అని యావత్ భారత్ వీరత్వానికి ప్రతీకగా నిలిచే శివాజీ మహరాజ్ 395 వ జయంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధైర్యానికి, ధీరత్వానికి మరో పేరు శివాజీ అని పేర్కొన్నారు. సమాజ హితం కోసం పని చేసిన శివాజీ మహరాజ్ ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ప్రతీ హిందువు సగర్వంగా తలెత్తుకు తిరుగుతున్నారు అంటే కారణం శివాజీ మహరాజ్ అని బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. శివాజీ మహరాజ్ అనుసరించిన విధానాలు నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తూ.. హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారని అన్నారు. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు శివాజీ మహరాజ్ అని కొనియాడారు. యావత్ భారత దేశం శివాజీ జన్మదిన వేడుకలు ఒక పండగవాతావరణం తలపించే రీతిలో చేస్తున్నారని చెప్పారు. విగ్రహదాత రిటైర్డ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ మాట్లాడుతూ..చరిత్రకారుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవిత చరిత్ర నేటి తరం యువతకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని అన్నారు. అటువంటి మహనీయుని జీవిత విశేషాలు విద్యార్థి లోకం తప్పకుండా తెలుసుకోవాలని ఆయన కోరారు.





