News

వలసజీవికి స్వయంసేవకుల అంతిమ సంస్కారం

243views

బతుకుదెరువు కోసం ఎక్కడో బిహార్ నుంచి తెలంగాణకు వచ్చిన 57 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణించాడు. ప్రభుత్వ ఆస్పత్రి మార్చురిలో ఉన్న అతడి పార్థివదేహానికి కన్నకొడుకుతో తలకొరివి పెట్టించడానికి, గౌరవ ప్రదంగా, సంప్ర దాయ బద్ధంగా అంతిమ సంస్కారాలు జరిపించడానికి ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు ముందుకు వచ్చారు. ఈ విషయంలో ఢిల్లీ నుంచి తెలంగాణ దాకా యావత్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థ అనిర్వచనీయమైన కృషి చేసింది. మానవత్వాన్ని మహోన్నత స్థానంలో నిలిపింది.

దీనికి దారితీసిన ఆ విషాద ఘటన ఫిబ్రవరి 2న తెలంగాణలో పెద్దపల్లి జిల్లా, ఓదెల సమీపంలో రాయ్ పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్సప్రెస్ రైలులో చోటుచేసుకుంది. బిహార్ కటిహార్ జిల్లా, రాంపదకు చెందిన 57 ఏళ్ల సంతోష్ మహతో కదులుతున్న రైలు నుంచి ప్రమాదవ శాత్తూ జారిపడి మరణించారు. సంతోష్ బిహార్ ఉన్న తన కుటుంబానికి అండగా ఉండ టం కోసమని హైదరాబాద్లోని ఓ బేకరిలో పని చేస్తున్నారు.

సంతోష్ అకాల మరణం ఆయన 19 ఏళ్ల కుమారుడు రోహిత్ మహతో, ఇతర కుటుంబ సభ్యుల్లో పెను విషాదాన్ని నింపింది. రోహిత్ స్వయం సేవక్. సాటి స్వయం సేవక్కు సాయపడ డానికి ఆర్ఎస్ఎస్ సకాలంలో ముందుకు వచ్చింది.

రాంపదలో స్వయంసేవకులు విషాద వార్తను ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ పెద్దలకు వెంటనే చేర వేశారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అక్కడి నుంచి తెలంగాణలో గోదావరిఖని దాకా చకచకా పనులు చేయడం మొదలుపెట్టారు. సంతోష్ మృతదేహం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉండగా మిగిలిన ఏర్పాట్లు జరిగిపోసాగాయి. గోదావరిఖని, రామగుండంలోని స్వయం సేవకులు బాధితులకు భావోద్వేగ పూరితమైన ఊరటను అందించడంతో సరిపుచ్చక కీలకమైన రవాణా ఏర్పాట్లు, తదితరాలకు ఆర్థిక సాయం అందించారు.

రోహిత్ మహతో స్వయంసేవకుల సమ స్వయంతో ఫిబ్రవరి 3న బిహార్ నుంచి హైదరాబాద్ కు విమానంలో చేరుకున్నారు. తోడ బుట్టినవారి కన్నా మిన్నగా ఆదుకున్న స్వయం సేవకుల సమక్షంలో అదే రోజు 3 గంటలకు తన తండ్రికి అంతిమ సంస్కారాలు చేశారు. స్వయంసేవకులు రోహిత్ మహతో తిరిగి స్వస్థలానికి చేరుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను అవిశ్రాంతంగా చేశారు. అడు గడుగునా అతడికి అండగా ఉన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో బాధిత కుటుంబం మోయ లేని భారాన్ని తమదిగా చేసుకున్నారు. చోటు కాని చోటులో కన్నుమూసిన సంతోష్ అనాథలా మిగిలిపోకుండా అన్నీ తామైన స్వయంసేవకులు గౌరవప్రదమైన రీతిలో అంతిమ సంస్కారాలు జరిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చారు. రోహిత్ తలకొరివి పెట్టించడం ద్వారా అతడితో తండ్రి రుణం తీర్చుకునేలా చేశారు.