News

భారతీయ తత్త్వం, వివేకానికి నిదర్శనం!

293views

ప్రయాగ్ రాజ్ లో శ్రీ ఆదిశంకర విమాన మండవం దేవస్థానం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లాంటి ప్రముఖులతో పాటుగా కుంభమేళాకు విచ్చేస్తున్న సాధారణ భక్తులు సైతం విమాన మండపాన్ని సందర్శించుకుంటున్నారు. కుంభమేళా జరుగుత్ను చోట భారతీయ తత్త్వం, సాంస్కృతిక చైతన్యానికి ఓ ప్రధానమై కేంద్రంగా ఈ దేవస్థానం వినుతికెక్కింది. 69వ కంచి కామకోటి పీఠాధిపతి స్వామి జయేంద్ర సరస్వతి తన గురువు చంద్రశేఖర సరస్వతి ఆకాంక్షను నెరవేర్చడం కోసమని ఈ దేవస్థానాన్ని నిర్మించారు. 1934లో గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి దారాగంజ్ ఆశ్రమంలో బస చేశారు. అప్పుడే ప్రయాగలో చాతారు సాన్ని నిర్వర్తించారు. ప్రతి రోజూ త్రివేణి సంగమానికి నడుచుకుంటూ వెళ్లి స్నానమాచరించేవారు. ఆ సందర్భంగా డ్యామ్ కు దగ్గర్లో రెండు రావి చెట్ల మధ్య ఖాళీ స్థలాన్ని గుర్తించారు. గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి ఆధ్యాత్మిక అంతర్ దృష్టితో ఆ ఖాళీ స్థలంలోనే జగద్గురువు ఆది శంకరాచార్యుడు, కుమారిల్ భట్ నడుమ ఒక జగద్వితమైన చర్చ జరిగిన వైనాన్ని నిర్ధారించుకున్నారు. ఆ దృష్టితో అక్కడ ఓ దేవాలయాన్ని నిర్మించాలని ఆకాంక్షించారు. శంకరాచార్య స్వామి జయేంద్ర సరస్వతి తదనంతర కాలంలో గురువుగారి ఆకాంక్షను సాకారం చేశారు.

1969లో అప్పటి యూపీ గవర్నర్ గోపాల్ రెడ్డి శ్రీ ఆది శంకర విమాన మండపం దేవస్థానానికి శంకుస్థాపన చేశారు. గుడిలో విగ్రహాల కోసమని, గుడి నిర్మాణం కోసమని రాళ్లను దక్షిణ భారత దేశం నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. ప్రయాగ్ రాజ్ లో ద్రావిడ శిల్పకళకు అద్దం పడుతున్న ఈ దేవస్థానాన్ని 1986 మార్చి 17న భక్తుల కోసం తెరిచారు. 130 అడుగుల ఎత్తున్న గుడిలో శ్రీ ఆదిశంకరాచార్య, దేవీ కామాక్షి, తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాలతో పాటుగా 51 శక్తిపీఠాలు, 108 శివలింగాలు, సహస్ర యోగ లింగ భక్తుల పూజలు అందుకుంటున్నాయి. ఇదే ప్రాంగణంలో గణపతి కోసమని ప్రత్యేకంగా ఓ గుడి ఉంది. భక్తులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు తిరిగ సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు శ్రీ ఆది శంకర విమాన మండపాన్ని సందర్శించుకోవచ్చు. అక్కడి నుంచి త్రివేణి సంగమంతో పాటుగా కుంభమేళాను అల్లంత ఎత్తు నుంచి చూడవచ్చు.