News

ముస్లింలను రెచ్చగొడుతున్న ఆప్ మాజీ ఎమ్మెల్యే

216views

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాభవం పాలైంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే హాజీ యూనస్ ముస్లింలు రెచ్చగొడుతున్నారు. సమాజంలో రెచ్చగొట్టే ధోరణులను ప్రేరేపిస్తున్నారు.ముస్తఫాబాద్ పేరును శివ విహార్ గా మార్చే విషయంపై రెచ్చగొడుతున్నారు. ముస్లింలు గాజులు వేసుకొని కూర్చొలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను బతికి వున్నంత కాలం ముస్తఫాబాద్ పేరును మార్చనివ్వనని, ఏం చేసినా.. చేసుకోండి.. పేరు మాత్రం మార్చనివ్వమని వ్యాఖ్యానించారు.

అసలు జరిగిందేమిటంటే..?
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత ముస్తఫాబాద్ నుంచి గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్త్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ముస్తఫాబాద్ పేరుని ‘‘శివపురి లేదా శివ విహార్’’ గా మారుస్తామని ప్రకటించారు. ముస్తఫాబాద్ పేరు కారణంగా ఇక్కడ వేరు వారు, చదువుకున్న వ్యక్తులు ఇక్కడికి వచ్చి స్థిరపడేందుకు ఇష్టపడరన్నారు. అందుకే దీని పేరుని శివపురి లేదా శివ విహార్ గా మారుస్తానని ప్రకటించారు. డేటా ప్రకారం ఇక్కడ 45 శాతం ముస్లింలు వున్నారని అన్నారు. అయితే దీనిపై మాజీ ఎమ్మెల్యే హాజీ యూనస్ స్పందిస్తూ.. తాము ముస్తఫాబాద్ లో 48.9 శాతం వున్నామని, దీనిని మోహన్ సింగ్ బిష్త్ సరిచేసుకోవాలన్నారు. ఏది ఏం జరిగినా.. పేరును మాత్రం మార్చనివ్వమని రెచ్చగొడుతున్నారు.