News

ఉగ్రవాది హఫీజ్ తల్హా సయీద్ ఉపన్యాసం వెనుక పాక్ ఆర్మీ?

239views

లష్కరే తోయిబా ఉగ్రవాది, ముంబై దాడి సూత్రధారి హఫీజ్ మహ్మద్ కుమారుడు హఫీజ్ తల్హా సయిద్ తాజాగా పీఓకేలో జరిగిన ర్యాలీలో రొచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు. ఏకంగా ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి వ్యతిరేకంగానే మాట్లాడాడు. అలాగే తన తండ్రి హఫీజ్ సయీద్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. ఏం జరిగినా సరే కశ్మీర్ ను భారత్ నుంచి విముక్తం చేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అయితే హఫీజ్ తల్హా సయీద్ అలా మాట్లాడటం వెనుక పాకిస్తాన్ ఆర్మీ హస్తమున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ రాసిచ్చిన స్క్రిప్టే తల్హా సయీద్ చదివినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా వంటి నిషేధిత గ్రూపులకు పాకిస్తాన్ ఆర్మీ మద్దతివ్వడం చూస్తుంటే ఇది పక్కా వారి ప్రాయోజిత కార్యక్రమమే అని అర్థమైపోతోందని విశ్లేషకులు అంటున్నారు.

తల్హాసయీద్ LET తీవ్రవాద సంస్థ సీనియర్ నేత. భారత్, అమెరికా లాంటి దేశాలు దీనిని తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి కూడా. తల్హా సయీద్ భారత్ కి వ్యతిరేకంగా, కశ్మీర్ కి వ్యతిరేకంగా ఉద్వేగభరిత ఉపన్యాసాలిస్తాడు. కశ్మీర్ కి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడల్లా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తాడు. ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం ఒంటరైందని, ఓ వ్యూహంలో భాగంగానే ఇలా మాట్లాడాడని భారత్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ ప్రసంగం పాక్ మద్దతు కోసం, అలాగే భారత్ ను ప్రత్యర్థిగా చూపే భాగంలోనే అని అనుమానాలు వస్తున్నాయి.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు వెన్నుదన్ను లభించింది. హమాస్ ఉగ్రవాదులను బలపరుస్తూ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు హమాస్ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించాయి.ఇన్నాళ్లూ కేవలం పశ్చిమాసియాకే పరిమితమైన హమాస్.. ఇప్పుడు విస్తరణపై దృష్టి పెట్టిందా? అన్న అనుమానాలు వస్తున్నాయి. పీఓకే లో హమాస్ ను బలపరుస్తూ ఇస్లామిక్ ఉగ్రవాదులు తీసిన బైక్ ర్యాలీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో భారత్ భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.టెహ్రాన్ లో పనిచేసిన హమాస్ ప్రతినిధి ఖలేద్ ఖద్దౌమీ ఈ యేడాది ప్రారంభంలో పాక్ పార్లమెంట్ కి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

ఫిబ్రవరి 5వ తేదీని కశ్మీర్‌ సంఘీభావ దినంగా పాకిస్థాన్‌ పాటిస్తుంది. ఈ సందర్భంగా రావల్‌కోట్‌లోని షాహిద్‌ సబీర్‌ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో జైషే మహమ్మద్‌(జేఈఎం), లష్కరే తాయిబా(ఎల్‌ఈటీ) ప్రధాన కమాండర్లతోపాటు హమాస్‌ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఇరాన్‌లో హమాస్‌ ప్రతినిధి డాక్టర్‌ ఖలీద్‌ అల్‌ ఖుదామీ.. ఈ సమావేశంలో హమా్‌సకు ప్రాతినిధ్యం వహించారు. హమాస్ తో సంబంధం ఉన్న మరికొందరు పాలస్తీనా నేతలు కూడా ఖలీద్‌ వెంట ఉన్నారు. ఇక, జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌ సోదరుడు తల్హా సైఫ్‌, జైషే కమాండర్లు అస్గర్‌ ఖాన్‌ కశ్మీరీ, మసూద్‌ ఇలియా్‌సతోపాటు లష్కర్‌ కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.