News

గుజరాత్‌లో యూసీసీపై కమిటీ ఏర్పాటు

211views

ఉత్తరాఖండ్లో అమలు చేసిన ఉమ్మడి పౌరస్మృతి దేశమంతా పెద్ద ప్రభావాన్నే చూపించింది. ఈ పౌరస్మృతిని అమలు చేసేందుకు మరిన్ని రాష్ట్రాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

గుజరాత్‌లోనీ బీజేపీ ప్రభుత్వం కూడా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో యూసీసీ అమలు ఆవశ్యకతను అంచనా వేసేందుకు, ముసాయిదా బిల్లు రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ రంజనాదేశాయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ 45 రోజుల్లో నివేదిక ఇస్తుందని, అనంతరం యూసీసీ అమలుపై నిర్ణయం తీసుకుంటామని సీఎం భూపేంద్ర తెలిపారు.