
వదాన్య సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాలకు గుర్తింపు లభించింది. కేఎన్ గోవిందాచార్య స్థాపించిన భారత వికాస సంఘం 7వ భారతీయ సంస్కృతీ ఉత్సవాలు కర్ణాటకలోని కలబురిగి సమీపంలోని సీడంలో వారం రోజుల పాటు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా సమాజ సేవ చేస్తున్న 51 మందిని గుర్తించి అవార్డులతో సత్కరించారు. ఈ సందర్భంగా వదాన్య సొసైటీ వ్యవస్థాపకుడు అశోక్ పడపాటికి ‘యువ భారత్ గౌరవ్ సమ్మాన్’ అవార్డును ప్రధాన సమన్వయకర్త బసవరాజ్ పాటిల్, మాజీ ఎంపీ, రిటైర్డ్ మేజర్ జనరల్ ప్రమోద్ సెహగల్, వందేమాతరం ఫౌండేషన్ మాధవరెడ్డి, సీజీఆర్ అధిపతి లీలా లక్ష్మారెడ్డి తదితరులు అందజేశారు. వదాన్య ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు సహాయం చేయడం, గ్రామీణుల ప్రతిభను ప్రోత్సహించడం, విద్యార్థులకు బహుమతులు అందజేయడం తదితర సేవాకార్యక్రమాలకు ఈ అవార్డు దక్కిందని అశోక్ పడపాటి పేర్కొన్నారు.





