News

చక్కెర వ్యాధికి సంప్రదాయ జీవన విధానమే మందు

182views

మధుమేహ వ్యాధికి భారతదేశం కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. వయసుతో నిమిత్తం లేకుండా మధుమేహ బాధితులు కనిపిస్తున్నారు. దీనికి పరిష్కారం లేదా? ఉందనే చెబుతున్నారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జనవరి 9వ తేదీన జస్టిస్ చంద్రచూడ్ బెంగళూరులో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేమీ న్యాయశాస్త్ర సంబంధమైనది కాదు. డైయాబెటీసు సంబంధించినది. మధుమేహాన్ని తగ్గించుకోవడానికి, లేదా రాకుండా చూసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం మన పూర్వికుల తరహాలో జీవించడమేననీ, వారు అనుసరించిన ఆహార సంస్కృతిని అనుసరించడమేననీ ఆయన చెప్పారు. మొత్తంగా మన ముందు తరాలవారి జీవన శైలిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. బెంగళూరులోని నారాయణ నేత్రాలయలో జరిగిన ‘డైయాబెటిస్ నో మోర్’ అన్న పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. డాక్టర్ భుజంగ శెట్టి ఈ పుస్తకం రాశారు. కాలపరీక్షకు నిలిచిన మన పూర్వికుల జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా మధుమేహ వ్యాధిని దరి చేరనీయకుండా ఉ ంచవచ్చునని ఈ సందర్భంగా మాజీ ప్రధాన న్యాయమూర్తి అన్నారు. పౌష్టికాహారం, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడిని క్రమబద్ధం చేసుకోవడం, మానవ సంబంధాల నిర్వహణ, పంచదార, మద్యం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడం అనే 8 సూత్రాలను మరచి పోరాదని ఆయన చెప్పారు. మన సంప్రదాయం మేరకు చిరుధాన్యాల వంటలు తినడం, మన నానమ్మలు, అమ్మమ్మలు చేసిన వంటకాలను మళ్లీ ప్రారంభించడం ఇంకా మంచి మార్గమని ఆయన అన్నారు.