News

వలసవాద విద్య కొనసాగింపు వల్లే సమాజంలో అశాంతి : గవర్నర్ ఆరిఫ్ ఖాన్

102views

భారతీయ సంప్రదాయ విద్య కేవలం సాధికారతే చేకూర్చే తత్వం వున్నది కాదని, ముక్తిని కూడా ప్రసాదించే తత్వం వున్నదని బిహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పేర్కొన్నారు.పాశ్చాత్య విద్యా భావన మాత్రం కేవలం వ్యక్తి, సమాజం సాధికారతకు సంబంధించినదని, భారతీయ విద్యా భావన మాత్రం వ్యక్తి ముక్తిపైనే ఎక్కువ దృష్టి నిలుపుతుందని విశ్లేషించారు. ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన సెమినార్ లో Role of morality in Indian Education’,అనే దానిపై మాట్లాడారు. ఇప్పటికీ విదేశీ విద్యా విధానంపైనే ఆధారపడుతున్నామని, దానినే అనుసరిస్తున్నామని, దీంతో సమాజంలో సామాజిక ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయని పేర్కొన్నారు.

వ్యక్తి విద్యను ఎంత నేర్చుకున్నా… నైతిక విలువలను అవలంబించని పక్షంలో సులువుగా దిగజారిపోతారని అన్నారు. అయితే విద్య సాధికారతా సాధనంగా వుంటుందని, అయితే… విద్య ద్వారా పొందిన లాభాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది మాత్రం సూచించే మార్గం లేదని అభిప్రాయపడ్డారు.దీనికి కూడా వలసవాద విద్యను అనుసరించడమే కారణమన్నారు. అయితే.. మొదటి సారి జాతీయ విద్యా విధానం (NEP) అమలు, దాని గురించి మాట్లాడుతున్నామని, ఇందుకు సంతోషంగా వుందన్నారు.భారతీయ విద్యా విధానం మానవులకు దైవత్వాన్ని బోధిస్తుంది. ఇతరులు కూడా మనవారే అన్న దృష్టి కోణాన్ని అందిస్తుందన్నారు. మనలో వున్న ఆత్మే ఇవతలి వారిలో వున్నదీ ఆత్మే అన్న దానిని గ్రహిస్తే… ఇతరుల్లో దైవత్వాన్ని చూడడానికి మార్గం సుగుమ మవుతుందన్నారు. విద్యా విధానంలో వున్న వలసవాద మూలాలను వెంటనే తొలగించుకోవాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సూచించారు.