News

మహిళల సాధికారతకు వేదికగా మహాకుంభమేళా

290views

ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభమేళా వివిధ కార్యక్రమాలతో మహిళల సాధికారతను ప్రోత్సహించేందుకు ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తోంది. అనేక సంస్థలు, ఎన్జీవోలు, మహిళలకు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఈ కుంభమేళా ఓ వేదికగా నిలిచింది. మహిళా సాధికారత దిశగా మహిళల హక్కుల గురించి అవగాహన కల్పించేందుకు అనేక ఫెవిలియన్లు కూడా ఏర్పాటు చేశారు. మహిళల హక్కులను పరిరక్షించే చట్టాలపై అవగాహన కల్పించేందుకు జాతీయ మహిళా కమిషన్ ఒక ఫెవిలియన్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జాతీయ మహిళా కమిషన్ కు చెందిన శివంగి శుక్లా మాట్లాడుతూ…. మహిళల హక్కుల పై కమిషన్ అవగాహన కల్పిస్తోందని, న్యాయ సలహాలు అందిస్తోందని అన్నారు. జమ్ము కాశ్మీర్ కు చెందిన ఆసియా ఖాన్ అనే కళాకారిణి మాట్లాడుతూ…. మహా కుంభమేళ తన ఉత్పత్తులను ప్రదర్శించే అవకాశం కల్పించిందని అన్నారు. కాగా స్థానిక గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు తమ సంప్రదాయ హస్తకళలు, వస్త్రాలు, సేంద్రియ ఉత్పత్తులను విక్రయించేందుకు స్టాళ్ళను ఏర్పాటు చేశారు.