
458views
ప్రైవేటు ఆలయాల్లో పనిచేస్తున్న అర్చక, పురోహితులకు బీమా కార్డుల జారీకి ప్రభుత్వంతో చర్చిస్తున్నామని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద సూర్య పేర్కొన్నారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక, పురోహిత సంక్షేమ సేవా సంఘం తొలి సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోవాలని అన్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో అర్చక, పురోహిత శంఖారావం పేరుతో రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. సంఘం అధ్యక్షుడు దూర్వాసుల రామశాస్త్రి మాట్లాడుతూ.. బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.





