News

‘రామాయణ ప్రతుల వితరణ’ను ప్రారంభించిన ఎంపీ అరుణ్ గోవిల్

279views

ఇంటింటికి రామాయణం కార్యక్రమం కింద జాతీయ స్థాయి రామాయణ ప్రతుల వితరణ ప్రచారాన్ని నటుడు, బిజెపి ఎంపీ అరుణ్ గోవిల్ ప్రారంభించారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభమై ఏడాది పూర్తయిన నేపథ్యానికి గుర్తుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ లోని హపుర్ అరుణ్ గోవిల్ రామాయణ ప్రతులను పంచారు. మేరర్ నియోజకవర్గంలోని కిటౌర్ శాసనసభ స్థానం పరిధిలో రెండు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఐదు సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా 11 లక్షల రామాయణ ప్రతులను పంచాలన్నది. తన లక్ష్యమని ఆయన తెలిపారు. టీవీలో ప్రసార మైన ప్రఖ్యాత రామయణ ధారావాహికలో అరుణ్. గోవిల్ రాముడి పాత్ర ధరించి అలరించారు.