News

బకాయిలు చెల్లించండి… అలీఘర్ ముస్లిం యూనివర్శిటీకి నోటీసులు

269views

యూపీ ప్రభుత్వం అలీఘర్ ముస్లిం యూనివర్శిటీకి పన్ను నోటీసులు జారీ చేసింది. అలాగే సంభాల్ లో విద్యుత్ చౌర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ ప్రముఖులు, మసీదులు, మదర్సాలకు కూడా జరిమానాలు విధించింది. చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో వుండిపోయిన 24. కోట్ల పన్ను బకాయిలను 15 రోజులుగా క్లియర్ చేయాలని అలీఘర్ మున్సిపల్ కార్పొరేషపన్ యూనివర్శిటీకి నోటీసులు పంపింది.

మొండి బకాయిలు చెల్లించని పక్షంలో చట్టం ప్రకారం ఖాతాలను అటాచ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని యోగి ప్రభుత్వం హెచ్చరికలు పంపింది. 2017 నుంచి అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ అస్సలు బకాయిలే చెల్లించడం లేదు.

మరోవైపు యూనివర్శిటీ రిజిస్ట్రార్ తో మున్సిపల్ కమిషనర్ చర్చలు కూడా జరిపారు. బకాయిలను క్లియర్ చేయాలని కోరారు. అయితే.. బకాయిలను చెల్లించడానికి యూజీసీ నుంచి నిధుల కోసం యూనివర్శిటీ దరఖాస్తు చేసుకుందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.అయితే.. జాప్యం మాత్రం విపరీతంగా జరుగుతోందని, అందుకే రంగంలోకి దిగామని మున్సిపల్ కమిషనర్ తెగేసి చెప్పారు. కట్టని పక్షంలో యూనివర్శిటీ ఖాతాలను స్తంభింపజేస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు యూనివర్శిటీ పరిధిలోని 22 స్థలాలకు సంబంధించిన బకాయిలను క్లియర్ చేసింది. మరో 18 రకాల ఆస్తులకి సంబంధించిన రుణాలను మాత్రం చెల్లించడం లేదు. 15 రోజులుగా చెల్లించాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

మసీదు రీ సర్వే సందర్భంగా సంభాల్ లో అల్లర్లు చెలరేగాయి. ఈ సమయంలో అక్కడి ప్రాంతంలో విపరీతమైన విద్యుత్ చౌర్యం జరిగింది. దీనిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని, ఇప్పటికే చర్యలకు ఉపక్రమించింది. దాదాపు 1,400 కి పైగా ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. నేరస్థుల్లో సమాజ్ వాదీ ఎంపీ రహ్మాన్ బార్క్ తో పాటు 16 మసీదులు, 2 మదర్సాలు కూడా వున్నాయి.

దాదాపు 100 ఇళ్లకు సరిపోయే విద్యుత్ సరఫరా నెట్ వర్క్ ను కూడా అధికారులు గుర్తించారు. దీంతో 11 కోట్ల జరిమానా విధించారు. ఇప్పటికే 20 లక్షలను రికవరీ చేశారు. మిగిలిన వారి విషయంలోనూ ఇప్పుడు వసూలు చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. వీలైనంత తొందరగా వీరి నుంచి జరిమానా వసూలు చేయనున్నారు. మిగతా వారిపై కూడా విచారణ జరుగుతోందని, విద్యుత్ చౌర్యం రుజువైతే మాత్రం జరిమానాలు వసూలు చేస్తామన్నారు.