News

‘‘జైశ్రీరాం’’ అన్నందుకు విద్యార్థిపై కాన్వెంట్ స్కూల్ కక్ష…

294views

ఆ విద్యార్థి అల్లరి చేయలేదు. ఉపాధ్యాయుల్ని తిట్టనూ లేదు. ఆయన చేసిందేమో తెలుసా… పక్క విద్యార్థిని జైశ్రీరాం అంటూ పలకరించడమే. అంతే… స్కూల్ యాజమాన్యం ఆ హిందూ విద్యార్థిపై పగబట్టింది. పరీక్షలు రాయకుండా ఆపేసింది. ఇది జరిగింది యూపీలోని చిత్రకూట్ జిల్లాలోని కార్వీ పట్టణం. సెయింట్ థామస్ సీనియర్ సెకండరీ స్కూలులో చదువుతున్న ఓ హిందూ విద్యార్థి తోటి విద్యార్థిని జైశ్రీరాం అని పలకరించాడు. అంతే పాఠశాల యాజమాన్యం సీరియస్ అయ్యింది. పరీక్షలు రాయకుండా ఆపేసింది.

హర్ష్ పాండే ఈ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ ఘటన జరగడంతో హర్ష్ తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా వెంటనే జోక్యం చేసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆ పాఠశాల ఆ బాలుడ్ని పరీక్షలు రాయడానికి అనుమతిని ఇచ్చింది.

ఈ ఘటనపై హర్ష్ పాండే తండ్రి సీరియస్ అయ్యారు. ఇదేం నియమం? అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. జైశ్రీరాం అని పలకరిస్తే ఓ విద్యార్థిని పరీక్షలు రాయనీయకుండా చేస్తారా? ఇదేం శిక్ష? అంటూ పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. దీంతో పాఠశాల ప్రిన్సిపాల్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.