News

తమిళ భాషా మాసంగా జనవరి

218views

జనవరి నెలను తమిళ భాష, వారసత్వ సంపదల మాసంగా ప్రకటించాలంటూ అమెరికా కాంగ్రెస్‌లో తీర్మానం దాఖలైంది. భారత సంతతికి చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి నేతృత్వంలో 15 మంది చట్ట సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తమిళులు వైభవంగా జరుపుకొనే పొంగల్‌ పండుగ రోజునే ఈ పరిణామం చోటు చేసుకుంది.