News

183 దేశాల్లో ట్రెండింగ్‌లో కుంభమేళా వెబ్‌సైట్‌

266views

మహా కుంభమేళా వెబ్‌సైట్‌ 183 దేశాల్లో ట్రెండింగ్‌గా మారింది. కుంభమేళా సమాచారం కోసం దేశవిదేశాల్లోని నెటిజనులు…ఈ వెబ్‌సైట్‌లో సెర్చింగుల మీద సెర్చింగులు చేస్తున్నారు. ఇప్పటికే 33 లక్షలమంది విదేశీయులు ఈ వెబ్‌సైట్‌లో సెర్చ్‌ చేశారు. యూరప్‌, అమెరికా, ఆఫ్రికా దేశాల్లోని లక్షలాదిమంది నెటిజనులు మహా కుంభమేళా వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌కు ఎలా రావాలి, కుంభమేళాలో ఎలా పాల్గొనాలి అనే సమాచారాన్ని వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. ఈసారి విదేశాల నుంచి భారీ సంఖ్యలో జనం మహాకుంభ్‌కు తరలిరానున్నారు.

డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ
భక్తుల భద్రత దృష్ట్యా, కుంభమేళా జరిగే ప్రాంతాన్ని డ్రోన్ల ద్వారా పర్యవేక్షించనున్నారు. ఎవరైనా భక్తులు స్నానం చేస్తూ, ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోతే వారిని లైఫ్ బోట్ల ద్వారా రక్షించనున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభమేళాకు రైల్వే శాఖ మూడు వేలకు పైగా రైళ్లను నడుపుతోంది. రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక విధుల్లో నియమితులైన రైల్వే సిబ్బంది క్యూఆర్‌ కోడ్‌లు ఉన్న జాకెట్లను ధరిస్తారు. వీటి సాయంతో భక్తులు డిజిటల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మహా కుంభమేళాలో 50 వేలకు పైగా భద్రతా సిబ్బందిని మోహరిస్తారు. వీళ్లకు కుంభమేళా ప్రాంతంలోని ప్రతి అంగుళాన్ని పర్యవేక్షించగలిగేలా AI ఆధారిత సాధనాలు అందిస్తారు. కుంభమేళా ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. కుంభమేళా ప్రాంతం అంతటా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏఐ ఆధారిత డ్రోన్‌లను కూడా వినియోగించనున్నారు.