News

తెలుగు సంస్కృతిని అర్థం చేసుకోవాలి

253views

ప్రకృతి పట్ల అవగాహన పెంచుకోవడమే సంక్రాంతి అసలు లక్ష్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో నిర్వహించిన రెండో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలుగు సంస్కృతిని అంతా అర్థం చేసుకోవాలని చెప్పారు. మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన ఆరింటిలో తెలుగు ఒకటని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు 15వ భాష అని పేర్కొన్నారు. మన దేశంలో ఎక్కువగా మాట్లాడే వాటిలో నాలుగో బాషా అని అన్నారు.