News

ముస్లిం యువతిని బైక్ ఎక్కించుకున్నాడని హిందూ యువకుడిపై దాడి

591views

ముస్లిం యువతిని బైక్ ఎక్కించుకున్నాడని హిందూ యువకుడిని అడ్డుకుని చితకబాదిన ఇద్దరు నిందితులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ రాధాకిషన్‌రావు వివరాల ప్రకారం ఓ కళాశాల విద్యార్థిని తోటి యువతి లిఫ్ట్‌ అడగడంతో ఆమెను ద్విచక్రవాహనంపై మాసబ్‌ట్యాంక్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌ వైపు తీసుకువెళ్తుండగా అది గమనించిన ఇద్దరు ముస్లిం యువకులు యాఖుత్‌పుర నివాసి మహ్మద్‌ సోహెల్‌, మహ్మద్‌ రెహ్మత్‌ అహ్మద్‌ న్యూ సాగర్‌ ప్లాజా కాంప్లెక్స్‌ వద్ద ఆ యువకుడిని అడ్డగించి అతనిపై దాడి చేశారు. అంతటితో ఆగక బాధితుడి మొబైల్ కూడా లాక్కొని వెళ్లిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఈ నెల 26న ఆబిడ్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి ఆదివారం అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.