
704views
బీజేపీ రాజ్యసభ సభ్యుడు శ్రీ జీవీఎల్ నరసింహారావుకు మాతృవియోగం కలిగింది. జీవీఎల్ తల్లి శ్రీమతి చౌడేశ్వరి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జీవీఎల్ మాతృమూర్తి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో జీవీఎల్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
“బీజేపీ రాజ్యసభ ఎంపీ శ్రీ @GVLNRAO గారి మాతృమూర్తి చౌడేశ్వరి గారు నేడు స్వర్గస్థులైనారు..
వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అని కన్నా లక్ష్మీ నారాయణ ట్వీట్ చేశారు.
Photo : తల్లి, ఇతర కుటుంబ సభ్యులతో శ్రీ GVL [ఫైల్ ఫోటో]





