NewsProgramms

శ్రీశైలం మాడ వీధులలో నగర సంకీర్తనం

1.1kviews

మాస శివరాత్రి సందర్భంగా శ్రీశైల దేవస్థాన పవిత్రత కాపాడటం కోసం మాడ వీధులలో నగర సంకీర్తన జరిగింది. నంద్యాల జిల్లా విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నగర సంకీర్తనలో 60 మంది భక్తులు పాల్గొన్నారు. సంకీర్తన మొదలైన వెంటనే కుండపోతగా వర్షం కురిసినా ఏ ఒక్క కార్యకర్త పక్కకి వెళ్లకుండా మూడు ప్రదక్షిణలు పూర్తయ్యే వరకు శివనామస్మరణ లో తడిసి ముద్దవడం విశేషం.

అనంతరం నగర సంకీర్తనలో పాల్గొన్న వారికి దేవాలయ కార్యనిర్వహణాధికారి మల్లిఖార్జున స్వామి వారి స్పర్శ దర్శనం, అమ్మవారి దివ్య దర్శనం ఏర్పాటు చేశారు. కార్య నిర్వహణాధికారికి, సభ్యులకు నంద్యాల జిల్లా విశ్వహిందూపరిషత్ అధ్యక్షులు ధన్యవాదాలు తెలియజేశారు.

కాగా అదే రోజు అన్యమతుస్థులు దేవాలయ షాపింగ్ కాంప్లెక్సులో షాపుల వేలంలో తాము కూడా   టెండర్లు వేసేందుకు అనుమతించాలని కోరుతూ హైకోర్టు లో వేసిన కేసును న్యాయస్థానం వారు కొట్టివేయటం కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇది విశ్వహిందూ పరిషత్ మరియు అన్ని హిందూ సంస్థల సమష్టి విజయమని ఇలాగే జిల్లాలో ఉన్న అన్ని క్షేత్రాలలో సంకీర్తన మొదలెట్టి దేవాలయ భూములు అన్యాక్రాంతం మరియు అన్యమతస్థుల జోక్యంపై పూర్తి ఉక్కు పాదం మోపుతామని యర్రం విష్ణువర్ధన్ రెడ్డి గారు తెలియజేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.