Articles

భారతదేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే మహా కుంభ మేళ

156views

మహాకుంభ్ 2025ని భారత సాంస్కృతిక ఐక్యతకు ప్రపంచ చిహ్నంగా మార్చాలని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటోందని ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విజయవాడలో భారీ రోడ్‌షో జరిగింది. రోడ్‌షో అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శంగా నిలిచే ఓ అద్భుతమైన వేడుకగా ‘మహాకుంభ్‌’ను అభివర్ణించారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్-2025లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ ప్రజలను ఈ సందర్భంగా ఆయన ఆహ్వానించారు. అంతర్జాతీయ భాగస్వామ్యం, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ కార్యక్రమం చారిత్రాత్మకంగా నిలిచిపోయేందుకు ప్రభుత్వం గణనీయమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. మహాకుంభ్ భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలిగి ఉందని,’ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్-సంవేశి భారత్ (ఏక భారతదేశం, గొప్ప భారతదేశం, సమ్మిళిత భారతదేశం)ను స్పృశించే దైవిక, శక్తివంత రూపమని పేర్కొన్నారు.

ఉపముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ” ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం పవిత్ర ఒడ్డున మహాకుంభ్ జరుగుతుందన్నారు. మానవాళికి అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వంగా యునెస్కో గుర్తించిన మహాకుంభ్ .. 12 సంవత్సరాల విరామం తర్వాత మరోసారి పవిత్ర భూమి ప్రయాగలో జరుగుతోంది.

స్వచ్ఛ, శుభ్రత, సురక్షిత,హరిత మహాకుంభ్..
మహాకుంభ్ ఏర్పాట్లపై మీడియాతో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “ఇది పరిశుభ్రమైన, ఆరోగ్యకర, సురక్షిత, డిజిటల్ మహాకుంభ్ అవుతుంది. ప్లాస్టిక్‌ రహిత మహకుంభ్ గా ప్రకటించడం ద్వారా పర్యావరణహిత కార్యక్రమంగా దీనిని మార్చాలని మేము ప్రతిన పూనమన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మేళా ప్రాంతంలో వివిధ డోన-పట్టాల విక్రయదారులకు దుకాణాల ఏర్పాటుకు అవకాశం కల్పించాం. పరిశుభ్రతపై చర్చించడానికి 400 పాఠశాలల ప్రిన్సిపాళ్ళతో సమావేశాలు జరిపామన్నారు. ప్రయాగ్‌రాజ్ జనాభా కంటే ఇది 5 రెట్లు ఎక్కువ. అలాగే హర్ ఘర్ దస్తక్ ప్రచారం కింద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత పర్యావరణం అనే సందేశాన్ని ప్రతి ఇంటికి పంపిస్తాం” అని ఆయన చెప్పారు.మహాకుంభమేళా 2025ని క్లీన్‌ అండ్ గ్రీన్‌గా మార్చడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని ఆయన తెలిపారు. ‘ప్రయాగ్‌రాజ్ అంతటా సుమారు మూడు లక్షల మొక్కలను పెంచామన్నారు. మేళా ముగిసిన తర్వాత కూడా వాటి సంరక్షణ మరియు నిర్వహణకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది’ అని వెల్లడించారు.యాత్రికులు, సాధువులు, పర్యాటకులకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలు,
ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ మహాకుంభమేళాకు సన్నాహాలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఆసుపత్రుల్లో పురుషులు, స్త్రీలు, పిల్లలకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. డెలివరీ గదులు, అత్యవసర వార్డులు, వైద్యుల గదులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ప్రత్యేక వెబ్‌సైట్, యాప్‌ను ప్రారంభించడం, 11 భాషల్లో ఎఐ-ఆధారిత చాట్‌బాట్; వ్యక్తులు వాహనాల కోసం క్యూఆర్-ఆధారిత పాస్‌లు, బహుభాషా డిజిటల్ లాస్ట్-అండ్-ఫౌండ్ సెంటర్; పరిశుభ్రత, గుడారాల కోసం ఐసిటి పర్యవేక్షణ; స్థలం, సదుపాయాల కేటాయింపు కోసం సాఫ్ట్‌వేర్; బహుభాషా డిజిటల్ సంకేతాలు (విఎండి), ఆటోమేటెడ్ రేషన్ సరఫరా వ్యవస్థ, డ్రోన్ ఆధారిత నిఘా, విపత్తు నిర్వహణ, 530 ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం లైవ్ సాఫ్ట్‌వేర్, ఇన్వెంటరీ ట్రాకింగ్ సిస్టమ్, గూగుల్ మ్యాప్స్‌ ద్వారా అన్ని ప్రాంతాల అనుసంధానం వంటి సన్నాహాలను ప్రభుత్వం చేసిందని తెలిపారు.

పర్యాటకులకు పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
స్వచ్ఛమైన తాగునీరు, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్ మరియు రివర్ ఫ్రంట్‌తో సహా 44 ఘాట్‌లలో పూల జల్లుల కోసం ఏర్పాట్లు చేశారంటు విలేకరుల సమావేశంలో ఉపముఖ్యమంత్రి మహాకుంభ్ ఏర్పాట్లను వివరించారు.మహాకుంభ్ కు హాజరయ్యే యాత్రికుల సంఖ్య లెక్కింపు సాంకేతికత పద్ధతిలో జరుగుతుందన్నారు.ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్-2025కి సుమారు 45 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రపంచ వేదికపై మహాకుంభ్ మతపరమైన కార్యక్రమానికి సంబంధించి సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సాంప్రదాయ, పౌరాణిక విశేషాలను అపురూపంగా ప్రదర్శిస్తోందని ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఉద్ఘాటించారు.