
విశాఖపట్నం, ఆగస్టు 19, 2026: విశాఖపట్నం సమీపంలోని గుడిలోవలో గల ‘విజ్ఞాన్ విహార్’ పాఠశాలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -RSS అఖిల భారతీయ సమన్వయ బైఠక్ ఈ ఉదయం ప్రారంభమైంది. సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ గారు, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబాలె గారు భారతమాత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఈ సమావేశాలను ప్రారంభించారు. ఈ సమావేశం ఆగస్టు 21వ తేదీ సాయంత్రం వరకు కొనసాగుతుంది.
ఈ వార్షిక అఖిల భారత సమన్వయ బైఠక్ లో సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ గారు, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబాలె గారితో పాటు, ఇతర సర్ కార్యవాహ్ లు మరియు ఇతర కేంద్ర కార్యవర్గ సభ్యులు పాల్గొంటున్నారు.
భారతీయ మజ్దూర్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భారతీయ కిసాన్ సంఘ్, రాష్ట్ర సేవికా సమితి వంటి సంఘ్ ప్రేరణతో నడిచే 32 సంస్థలకు చెందిన జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అఖిల భారత సంఘటనా కార్యదర్శులు మరియు ఎంపిక చేసిన ఇతర బాధ్యులు ఈ సమన్వయ సమావేశంలో పాల్గొంటున్నారు.

వివిధ సంస్థలకు చెందిన 253 మంది కీలక సభ్యులు (వీరిలో 49 మంది మహిళలు ఉన్నారు) మరియు సంఘ్ సభ్యులతో కలిపి మొత్తం 327 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని అంచనా.






